నిరుపేదలకు భరోసా ఇచ్చే స్కీం ; ఏటా రూ.72 వేల నగదు
లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీ పోటా పోటీ వాగ్దానాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద వాగ్దానం చేసింది. దేశంలోని పేదల కుటుంబాలకు ప్రతి ఏటా 72 వేలు ఇస్తామనమి హామీ ఇచ్చింది .ఈ రోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పథకం విధి విధానాలను ప్రకటించలేదు. ఏడాదికి ఒకే సారి జమా చేస్తారా లేదంటే ప్రతి నెల రూ.6 వేలు చొప్పున నగదు జామ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
2021 కల్లా పేదరిక రహిత దేశం
కాగా సమావేశం అనంరతం ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. పేదలకు కనీసం ఆదాయం పేరుతో పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా నిరుపేదల కుటుంబాలకు ఏటా 72 వేల ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. దేశ జనాభాలో 20 శాతం మంది ఉన్న నిరుపేదలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్ధిక సాయం నేరుగా లబ్దిదారుల అకౌంట్ లోనే జమా చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు
గరీబీ హఠావో స్పూర్తిగా...
ఇందిగాంధీ హయంలో తీసుకొచ్చి గరీబీ హఠావో పథకాన్ని స్పూర్తిగా తీసుకొని ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. గరీభీ హఠవో పథఖానికి ఈ పథకం ఆ పథకానికి పోలికలున్నాన్నారు. 2021 కల్లా పేదరిక రహిత భారత్ కు చూడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందుకే ఈ నగదు సాయం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. సాధ్యాసాధ్యాలపై ఆర్ధిక నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.