న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను పెద్దల సభకు పంపనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌‌గడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి  రాజ్యసభకు నామినేట్ చేసేందుకు పార్టీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. ప్రియాంక గాంధీ పార్లమెంటు ప్రవేశంతో రాజ్య సభలో పార్టీ గొంతును పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.


అంబికా సోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ సింగ్ సహా పలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పదవీకాలం ముగియబోతోన్న తరుణంలో కొత్తవారి ఆశలు ఆవిరి కాబోతున్నాయా అనే ఆందోళన మొదలయ్యింది. ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్, జార్ఖండ్‌కు కేటాయించిన ఖాళీల నుంచి కాంగ్రెస్ ఈ సీట్లను భర్తీ చేస్తుందని, మిత్ర పక్షాలతో కలిసి వీలైనన్ని స్థానాలు కైవసం చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..