ఛార్జీలు వసూలు చేస్తారా..?
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల నుంచి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల నుంచి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసలే కూలీలు కనీసం తిండి కూడా లేకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంటే.. వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ ఛార్జీలు వసూలు చేస్తారా..? అని ఆగ్రహించారు. వలస కూలీలు, వలస కార్మికులు దేశ ఆర్ధికాభివృద్ధికి మూలస్థంభాలని అభివర్ణించారు. అలాంటి వారిపై ఉదారత చూపించాల్సింది పోయి ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల్లో చిక్కుకున్న ధనిక భారతీయులను వేల కిలోమీటర్ల దూరం నుంచి ఉచితంగా విమానాల్లో తీసుకువచ్చినప్పుడు.. అదే పద్ధతి వీరికి ఎందుకు అవలంభించరని ప్రశ్నించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది వలస కూలీలు.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని సోనియా గాంధీ తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం కాలినడక ప్రయాణిస్తున్నారన్నారు. వారిని సొంత ఊళ్లకు తరలించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు.
వలస కూలీల దగ్గర నుంచి రైలు టికెట్ ఛార్జీలు చేయకుండా రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలా చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ..వలస కూలీల బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా వలస కూలీలకు టికెట్లు కొనుగోలు చేసే బాధ్యతను ప్రతి రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు సోనియా గాంధీ అప్పగించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..