మోదీ ఓ శిషుపాలుడు: '100 తప్పులు' పుస్తకంలో కాంగ్రెస్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై: భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ '100 తప్పులు' అనే టైటిల్‌తో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీని శిషుపాలుడిగా సంబోధించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అచ్చే దిన్ కోసం సామాన్యులు కన్న కలలు కల్లలయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది. అసత్య హామీలతో అధికారంలోకొచ్చిన బీజేపీ గత ఐదేళ్ల కాలంలో మాట నిలబెట్టుకోలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 2014లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. అభివృద్ధిలో బీజేపి విజయం సాధించలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ ఈ పుస్తకంలో పేర్కొంది.


మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్న కాంగ్రెస్ పార్టీ... మోదీ తప్పులకు లెక్క చెప్పాల్సిన సమయం ఇదేనని అభిప్రాయపడింది.