Kapil Sibal: వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో సీనియర్ నేత పార్టీని వీడారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. ఇటు సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభకు కపిల్ సిబాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్  యాదవ్‌ సమక్షంలో ఆయన నామినేషన్‌ వేశారు. త్వరలో సమాజ్‌వాదీ పార్టీలో కపిల్ సిబాల్ చేరనున్నారు. ఈనెల 16నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు కపిల్ సిబాల్‌ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పుల కోసం ఇటీవల ఉదయ్‌పూర్‌లో చింతన్ శివిర్‌ను ఆ పార్టీ చేపట్టింది. ఈసందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో పలు కీలక తీర్మానాలు చేశారు. కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్‌ బహిరంగంగానే తన తీరును వెల్లడించారు. పార్టీ పుంజుకోవాలంటే కీలక నిర్ణయాలు తప్పవన్నారు.  కాంగ్రెస్‌కు రెబల్‌గా ఉన్న జీ23లోనూ కపిల్ సిబాల్‌ ఉన్నారు. పార్టీ మొత్తాన్ని ఒకే కుటుంబం చేతులో పెట్టడం మంచిదికాదన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు బహిరంగానే ప్రకటించారు. ఈక్రమంలో ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది.


ఎవరూ పార్టీ వీడినా కాంగ్రెస్‌కు నష్టం లేదంటున్నారు హస్తం నేతలు. రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటున్నారు. ఆ దిశగా వెళ్తున్నామని చెబుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో దూసుకెళ్తున్నామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మరికొంత మంది పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీలక నేతలు కాంగ్రెస్‌కు వీడారు. గుడ్‌బై చెప్పే లిస్ట్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.


 


Also read:Amalapuram Update: పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు.. జనసేన నేతలు సంచలన కామెంట్లు..


Also read:LSG vs RCB Eliminator Playing XI: లక్నోతో బెంగళూరు ఢీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం! తుది జట్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి