LSG vs RCB Eliminator Playing XI: లక్నోతో బెంగళూరు ఢీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం! తుది జట్లు ఇవే

IPL 2022 Eliminator LSG vs RCB Dream 11 prediction and Playing XI. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 01:00 PM IST
  • లక్నోతో బెంగళూరు ఢీ
  • ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం
  • లక్నో vs బెంగళూరు డ్రీమ్ 11 టీమ్
 LSG vs RCB Eliminator Playing XI: లక్నోతో బెంగళూరు ఢీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం! తుది జట్లు ఇవే

IPL 2022 Eliminator, Lucknow Super Giants vs Royal Challengers Bangalore Playing XI: ఐపీఎల్ 2022లో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుని నేరుగా ఫైనల్ చేరింది. ఇక నేడు మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. 

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో, నాలుగు స్థానంలో ఉన్న బెంగళూరు మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు మాత్రం రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంటుంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి బెంగళూరు, లక్నో టీమ్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఈ ఏడాదే ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో.. అద్భుత ప్రదర్శనతో  ఏకంగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. అదే ఊపులో  ఎలిమినేటర్‌ను గెలవాలని చూస్తోంది. అయితే లీగ్ దశలో ఆడిన చివరి మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో ఓడిపోవడం ఆ జట్టుకు కాస్త ప్రతికూలాంశం అని చెప్పొచ్చు. స్టార్ ప్లేయర్స్ ఉన్న లక్నో పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, ఆయుష్ బదోని బ్యాటింగ్ విభాగంలో దుమ్ములేపుతున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరలతో బౌలింగ్ కూడా బాగుంది. 

ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారైనా గెలవాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి బెంగళూరుకు మరో అవకాశం లభించింది. ఛాంపియన్‌గానిలవాలంటే మూడు కీలక మ్యాచులు గెలవాల్సి ఉంది. ముందుగా ఎలిమినేటర్‌లో లక్నో చిత్తు చేస్తేనే టైటిల్ దిశగా ఓ అడుగు పడుతుంది. ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌నే ఆర్‌సీబీ నమ్ముకుంది. ఈ ఇద్దరు చెలరేగినా పరుగుల వరద పారడం ఖాయం. ఇక బౌలింగ్‌లో వనిందు హసరంగ, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ రాణిస్తున్నారు. అయితే స్టార్ పేసర్ హర్షల్ పటేల్ గాయం ఆ జట్టుని కలవరపెడుతోంది. ఒకవేళ హర్షల్ ఆడకుంటే.. అతడి స్థానంలో ఆకాశ్ దీప్ బరిలోకి దిగనున్నాడు. 

తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డుప్లెసిస్ (కెప్టె), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్/ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్. 
లక్నో సూపర్ జెయింట్స్‌: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్.  
 
డ్రీమ్ 11 టీమ్:
దినేష్ కార్తీక్, క్వింటన్ డికాక్ (కెప్టెన్), లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (వైస్ కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, వనిందు హసరంగ, మొహసిన్ ఖాన్.

Also Read: Coconut Water: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!

Also Read: Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News