ప్రియాంకగాంధీ నాయకత్వ పటిమ గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరా తరహా నాయకత్వ పటిమ ప్రియాంక సొంతమని.. ఇందిరా తరహా తెగువ, సమస్యలపై పోరాడే తత్వం వంటి లక్షణాలను ఆమె కలిగి ఉన్నారని ప్రసంశించారు.  ప్రతికూల పరిస్థితుల్లోనూ చెరగని చిరునవ్వుతో వాటిని అధిగమిస్తున్నారని ట్విట్టర్ వేదికగా శత్రుఘ్నసిన్హా కొనియాడారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రియాంక ఓ రోల్ మోడల్
పార్టీ, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ప్రియాంకగాంధీ ఇతర నేతలకు ఆమె రోడ్ మోడల్ నిలుస్తున్నారని శత్రుఘ్నసిన్హా ప్రసంశించారు.అవసరమైన పక్షంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ  లోటును కచ్చితంగా ప్రియాంక గాంధీ పూడ్చగలరని ఆ పార్టీ సినియర్ నేత శత్రుఘ్నసిన్హా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సహాన్ని నింపడం ప్రియాంక వల్లే సాధ్యపడుతుందన్నారు. పార్టీని నడిపించే సత్తా ఆమెకు పుష్కలంగా ఉందని కొనియాడారు. 


రాహుల్ స్థానంలో ప్రియాంక !!
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మనస్తాపం చెందిన ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తాను నాయకత్వ బాధ్యతలు స్వీకరించబోనని బీష్మించుకొని కూర్చున్న పక్షంలో ఆ పార్టీలో నాయకత్వ లోటు ఏర్పడింది. ఈ క్రమంలో సీనియర్ నేతలు బుజ్జగించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన మెట్టుదిగడం లేదు. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పిడి చర్చ జరగుతున్న తరుణంలో శత్రుఘ్నసిన్హా ప్రియాంక ప్రేరు ప్రస్తావించడం గమనార్హం.