Rahul Gandhi on NDA: వీలు చిక్కినప్పుడలా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..ఈసారి ఆ దాడిని తీవ్ర తరం చేశారు. ఇటీవల కొన్నింటికి తమ వద్ద తగిన డేటా లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఆయన తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈప్రభుత్వం వద్ద డేటానే కాదు..తగిన జవాబుదారితనం లేదని మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసందర్భంగా ఎన్డీయేకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఎన్డీఏ అంటే నో డేటా అవలైబుల్ అని సెటైర్లు వేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరు చనిపోలేదని..వ్యవసాయ చట్టాల ఆందోళనలో ఎలాంటి ఘటనలు జరగలేదని కేంద్రం చెప్పే మాటలను ఎవరూ నమ్మరని ఫైర్ అయ్యారు. దేశంలో అల్లర్లు, జర్నలిస్టులపై దాడులపై పట్టించుకోకపోవడాన్ని ఎవరూ మరిచిపోలేరని తెలిపారు. 


ఇలాంటి వాటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వద్ద డేటా గానీ..సమాధానం గానీ..జవాబుదారితనం కానీ లేదని మండిపడ్డారు. కరోనా సమయంలో చాలా మంది నడుచుకుంటే వెళ్తూ మరణించారని..ఆక్సిజన్ అందక రోగులు మృతులు చెందారని గుర్తు చేశారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాల్లో ప్రభుత్వ తప్పిదాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.



Also read:IND vs WI: విండీస్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు అరుదైన రికార్డు..!


Also read:Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.