Corona Fourth Wave: దేశంలో పెరుగుతున్న కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఏప్రిల్ 27న ప్రధాని మోదీ సమీక్ష
Corona Fourth Wave: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్దమౌతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి.
Corona Fourth Wave: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్దమౌతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జూన్ చివరి వారం నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..సెప్టెంబర్ వరకూ ఉంటుందన్న కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఫోర్త్‌వేవ్ భయం వెంటాడుతోంది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2 వేల 541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 మంది మరణించారు. గత కొద్దిరోజుల్నించి పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. దేశంలో ప్రస్తుంత 16 వేల 52 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా పాజిటివ్ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో చిన్నారుల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు కన్పిస్తుండటం కలవరం రేపుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి మాస్క్ ధారణ తప్పనిసరి చేయడమే కాకుండా..ఉల్లంఘిస్తే 5 వందల రూపాయల జరిమానా విధించారు. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 30 లక్షల 60 వేల 86 మందికి కరోనా వైరస్ సోకగా..5 లక్షల 22 వేల 223 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు దేశంలో 98.75 శాతముంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1862 మంది కోలుకున్నారు.
కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 27వ తేదీన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్, కరోనా సంక్రమణ, కరోనా ఫోర్త్‌వేవ్ ప్రభావంపై చర్చించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయనేది కేంద్ర ఆరోగ్యశాఖ వివరించనుంది.
Also read: JEE Mains Last Date: జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఇవాళ ఏప్రిల్ 25 ఆఖరు తేదీ, ఎలా అప్లై చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.