Union Health Minister Mansukh Mandaviya Review Meeting: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభణ పెరుగుతోంది. రూపం మార్చుకుంటూ నిత్యం ప్రజలపై పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కరోనా వైరస్ XBB.1.9.1 కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలపై సమావేశంలో చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎవరూ అనవసర భయాందోళనలకు గురికావద్దని సూచించారు. అన్ని రాష్ట్రాలు ఆరోగ్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశం నిర్వహించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కోవిడ్‌కు సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు ఆసుపత్రులను సందర్శించాలని మంత్రి కోరారు. పెరుగుతున్న కరోనా కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 


 




శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,050 కోవిడ్ కేసులను నమోదు అయ్యాయి. గురువారం 5,300 కేసులు నమోదవ్వగా.. నేడు ఆ సంఖ్య మరింత పెరింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కి చేరింది. 14 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,85,858గా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 2,334 డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 2,20,66,20,700 వ్యాక్సిన్‌లు సరఫరా చేసింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 2,060, మహారాష్ట్రలో  3,987 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి


Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి