India Covid-19: మళ్లీ తిరిగొచ్చిన కరోనా.. ఈసారి సరికొత్త రూపంలో.. ఒక్కరోజే 300కుపైగా కేసులు.. ఐదుగురు మృతి..
Covid-19 Cases: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజే 300కుపైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
India Covid-19 Update: భారత ప్రజలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈసారి ఈ వైరస్ మరో రూపంలో ఇండియాలోకి అడుగుపెట్టింది. ఇది కొవిడ్ యెుక్క JN-1 సబ్ వేరియెంట్. దీని దెబ్బకు దేశంలో ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఈ వైరస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు కేరళ, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వాలన్నీ అలర్ట్ అయ్యాయి. ప్రజలందరూ మాస్కులు ధరించడానికి, వ్యాక్సిన్లు వేసుకోవడానికి రెడీ అయ్యారు.
ఈ JN-1 కొత్త సబ్ వేరియెంట్ కు సంబంధించిన తొలి కేసును రీసెంట్ గా కేరళలోని తిరువనంతపురంలో గుర్తించారు. 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన లక్షణాలు కనిపించాయి. దీంతో అందరిలోనూ మళ్లీ భయం మెుదలైంది. అయితే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. JN-1 వేరియెంట్‌ను సెప్టెంబర్‌లోనే అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులు చైనాలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
సింగపూర్ లో గత వారంతో పోలిస్తే ఈ వీక్ 75 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో 50వేలకుపైగా కేసులు రిజస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ట్రావెల్ అడ్వజరీ జారీ చేసింది సింగపూర్ ప్రభుత్వం. రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దని.. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.
Also Read: Covid-19: సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు... ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook