కరోనాకు భయపడొద్దు: ప్రధాని మోదీ
కరోనావైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ప్రభలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని, బహుళ సంఖ్యలో పాల్గొనే సమావేశాలకు హాజరు కాకూడదని ప్రధాని మోదీ సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు
న్యూఢిల్లీ: కరోనావైరస్(Corona effect) వ్యాప్తి తీవ్ర స్థాయిలో ప్రభలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని, బహుళ సంఖ్యలో పాల్గొనే సమావేశాలకు హాజరు కాకూడదని ప్రధాని Narendra modi సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Public Health and Family Welfare)సేకరిస్తుందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు తెలిపారు.
Read Also: Sensex: భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ
వదంతలు నమ్మవద్దని, కరోనా వైరస్ పై సామాజిక మాధ్యమాల్లో(Social Media) ప్రసారమయ్యే పుకార్లను నమ్మవద్దని, వాటిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా వైరస్ పై ఎటువంటి భయాందోళనలు వద్దని, పటిష్టమైన జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
Read Also: టిక్ టాక్ తెచ్చిన తంటా..
అంతేకాకుండా కరోనా వ్యాప్తిని నివారించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం(Ministry of External Affairs) మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు యాత్రికుల వీసాలను రద్దు చేసింది. అయితే రద్దు చేసిన వీసాలు మార్చి 13వ తేదీ నుంచి టూరిస్ట్ వీసాల సస్పెన్షన్ నిర్ణయం అమలులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేశ అత్యవసర పరిస్థితిని బట్టి మాత్రమే నిబంధనల మేరకు వీసాలు అనుమతించబడుతాయని భారత విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..