Coronavirus ఎఫెక్ట్: వీసాలపై కేంద్రం సంచలన నిర్ణయం

మార్చి 13వ తేదీ నుంచి వీసాల సస్పెన్షన్ నిర్ణయం అమలులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం అధికారిక పర్యటనలు, దౌత్యపరమైన వీసాలు, కొందరు వీఐపీల వీసాలకు వెసలుబాటు కల్పించారు.

Last Updated : Mar 12, 2020, 10:14 AM IST
Coronavirus ఎఫెక్ట్: వీసాలపై కేంద్రం సంచలన నిర్ణయం

కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. మార్చి 13వ తేదీ నుంచి టూరిస్ట్ వీసాల సస్పెన్షన్ నిర్ణయం అమలులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం అధికారిక పర్యటనలు, దౌత్యపరమైన వీసాలు, కొందరు వీఐపీల వీసాలకు మాత్రమే ఈ సమయంలో పర్యటించే వెసలుబాటు కల్పించారు.

Also Read: కరోనా అనుమానితుడి మృతి కలకలం

కోవిడ్ 19 (COVID-19) వైరస్‌ను ఓ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకుని కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడనామ్ గేబ్రియాస్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో  ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణికులను 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచి కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాక వారిని ఆసుపత్రి నుంచి పంపివేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 13 నుంచి సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.

రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

కాగా, భారత్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు 62 నమోదయ్యాయి. కరోనా వైరస్ అనుమానిత వ్యక్తి బుధవారం చనిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇదివరకే దాదాపు 4వేల మంది ఈ కోవిడ్19 వైరస్ కారణంగా మృతిచెందారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News