Corona Fourth Wave Scare: కరోనా ఫోర్త్‌వేవ్ భయం ఇప్పుడు వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కరోనా సంక్రమణ కేసులు అధికమౌతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. ఇప్పుడు మరోసారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు స్కూళ్లలో చిన్నారులకు కరోనా వైరస్ సోకి..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుున్నారు. కొన్ని స్కూల్స్ పాక్షికంగా మూసివేశారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడాలో అదే పరిస్థితి కన్పిస్తోంది. 


నోయిడాలో గత 24 గంటల్లో 107 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధనగర్ పరిధిలో వెలుగుచూసిన ఈ 107 మందిలో 33 మంది చిన్నారులు కావడం గమనార్హం. అంటే 30 శాతం కేసులు చిన్నారులవే కావడం ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలో మొత్తం కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు 411 ఉన్నాయి. అయితే ప్రజలెవరూ ప్యానిక్ కావల్సిన అవసరం లేదని..ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుహాస్ సూచించారు. కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో 99 వేల 154 మందికి కరోనా వైరస్ సోకింది. అటు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1247 కొత్త కేసులు నమోదయ్యాయి.


దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 186.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇందులో 2 కోట్ల 27 లక్షల 79 వేల 246 సెషన్స్ ద్వారా వ్యాక్సినేషన్ నిర్వహించారు. 


Also read: Bengaluru: అశ్లీల చిత్రాలకు బానిసైన భర్త.. అశ్లీల చిత్రంలో నటించిందని భార్యపై అనుమానం.. పిల్లల ముందే దారుణ హత్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook