India Reports 16,156 New COVID-19 Infections, 733 Deaths in 24 hours: అదుపులో ఉంది అనుకుంటున్న కరోనా మళ్లి కోరలు చాస్తోంది.. గడచిన 24 గంటల్లో పాజిటివ్ సంఖ్యతో  పాటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గడచిన 24 గంటల వ్యవధిలో (last 24 hours) కేసుల సంఖ్య 16,156 పెరగ్గా..  మృతుల సంఖ్య మాత్రం 733గా నమోదైంది. మంగళవారం 12,90,900 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 16,156 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం రోజు కేసుల సంఖ్య 13 వేలకు పైగా, మరణాలు 500కు పైగా నమోదయ్యాయి. కానీ బుధవారం రోజున కేసులు 16 వేలకు పైగా నమోదవ్వగా.. మరణాలు 733.. ఫలితంగా కరోనా, మరణాలు పాజిటివ్ రెండింటి పరంగా పెరిగాయి అని చెప్పవచ్చు. 


Also Read: Mumbai Cruise Drugs Case : ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి కిరణ్‌ గోసవి అరెస్ట్‌


మొత్తం కేసులు 3,42,31,809 కోట్లకు పెరగ్గా.. 3.35 కోట్ల (98.19 శాతం) మంది కరోనాను జయించారు. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో గత కొంతకాలంగా యాక్టివ్ కేసులు (Active cases) అదుపులో ఉన్నప్పటికీ నిన్న మాత్రం కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ప్రస్తుతం 1,60,989 యాక్టివ్ కేసులు ఉండగా...  నిన్న మృతుల సంఖ్యలో బాగా పెరిగింది. మొన్న 585 మరణాలు నమోదయ్యాయితే నిన్న వాటి మరణాల సంఖ్య 733కు పెరిగింది.




ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 103 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు (doses) పంపిణీ అయ్యాయి. తాజాగా 49.09 లక్షల పైగా కోవిడ్ (Covid) వ్యాక్సిన్ వేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉంది. 


Also Read: Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి