Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు

Telangana inter first year exams 2021 spot valuation: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ (TS inter first year exams 2021) జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 09:19 AM IST
  • తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్‌కి తేదీలు ఖరారు
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిసిన వెంటనే స్పాట్ వ్యాల్యూయేషన్
  • జిల్లాల అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ
Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు

Telangana inter first year exams 2021 spot valuation: హైదరాబాద్‌: నవంబరు 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌‌ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలంగాణ సర్కారు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కేంద్రాల్లో రెండు దశల్లో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నవంబరు 6వ తేదీ నుంచి తొలి దశ మూల్యాంకనం, 8వ తేదీ నుంచి రెండో దశ మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారమే అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ (TS inter first year exams 2021) జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. 4వ తేదీన దీపావళి పండగ (Diwali holidays 2021) కానుండటంతో ఒక్క రోజు విడిచి 6వ తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టేందుకు ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.  

Also read : TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

ఇదిలావుంటే, ఇంటర్ పరీక్షల్లో (TS inter exams 2021) భాగంగా మూడో రోజైన బుధవారం మొత్తం 4,58,557 మంది విద్యార్థులకుగాను 4,29,972 మంది (93.8 %) విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

Also read : Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..

Also read : VVS Laxman political entry : త్వరలో బీజేపీలో చేరనున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News