Kiran Gosavi, NCB witness in Aryan Khan case, detained by Pune Police: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని (Kiran Gosavi) పుణే పోలీసులు (Pune Police) అరెస్ట్ చేశారు. తాజాగా కిరణ్ లక్నోలో లొంగిపోతానన్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం గోసవి లొంగిపోవడానికి అంగీకరించలేదు.
ఈ నెల ప్రారంభంలో ఆర్యన్ ఖాన్ తో (Aryan Khan) పాటు పలువురిని అరెస్టు చేయడానికి దారితీసిన క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ ( Narcotics Control Bureau) (NCB)దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత గోసవి ఆర్యన్ ఖాన్‌తో (Aryan Khan) సెల్ఫీలో కనిపించాడు.
ఇక 2018లో ఒక చీటింగ్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (look out circular) (LOC) జారీ చేయడంతో పరారీలో ఉన్నాడు గోసవి. కిరణ్ గోసవి కేపీజీ డ్రీమ్స్ సొల్యూషన్స్ పేరుతో ఔత్సాహికులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కంపెనీ నడిపారు. మలేషియాలోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసవి ఒకరి నుంచి రూ.3.09 లక్షలు (Rs 3.09 lakh) తీసుకొని మోసం చేశాడని పుణే పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : Cabinet Meet : ఏపీలో సీఎం జగన్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం
ఇక ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో విట్‌నెస్, డిటెక్టివ్ అయిన కిరణ్ గోసవిని పుణె పోలీసులు (Pune Police) విచారిస్తున్నారు. అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై (Cruise Drugs Case) దాడి జరిగినప్పుడు కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్‌సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది.
అలాగే ఆర్యన్‌ను (Aryan Khan) ఎన్సీబీ (NCB) కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో బాగా వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి (Gosavi) కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Also Read : Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook