Corona Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకుండానే థర్డ్‌వేవ్ భయపెడుతోంది. ముఖ్యంగా చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనే వాదన ఎక్కువగా విన్పిస్తోంది. అయితే ఇది ఎంతవరకూ నిజం..ఆధారాలున్నాయా లేవా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona Pandemic) ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే దేశంలోని ప్రజల్ని అల్లకల్లోలం చేసింది. సెకండ్ వేవ్(Corona Second Wave) నుంచి కోలుకోకుండానే థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. అదే సమయంలో కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే వాదన మరింతగా భయపెడుతోంది. ఈ వాదనలో ఎంతవరకు నిజముంది..ఒకవేళ నిజమే అయితే దీనికి ఆధారాలున్నాయా లేవా అనేది పరిశీలించాల్సి ఉంది.


ఈ విషయంపై కోవిడ్ 19 (Covid19) వర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ వివరణ ఇచ్చింది. కోవిడ్ థర్డ్‌వేవ్ చిన్నారులపై (Corona Third wave impact on children) ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే ఆరోరా తెలిపారు. దేశంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ స్ట్రెయిన్స్ యువత, చిన్నారులపై ప్రత్యేకంగా ప్రభావం చూపించేవికావని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ రెండు గ్రూప్‌లలో బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. అదే సమయంలో థర్డ్‌వేవ్ వస్తుందని అప్పుడే నిర్ఱారించలేమన్నారు. ఇండియాలోనూ, ఇతర దేశాల్లోనూ కేసుల్ని పరిశీలించి చూస్తే వచ్చే వేవ్‌లోనూ, రానున్న నెలల్లోనూ చిన్నారులే ఎక్కువగా కరోనా బారినపడతారని చెప్పేందుకు సరైన కారణాలు కూడా లేవని నిపుణులు చెబుతున్నారు. పీడియాట్రిక్ కోవిడ్ సేవల్ని మెరుగు పర్చేందుకు అదనపు వనరుల్ని సమకూర్చుకోవాలన్నారు. ప్రత్యేక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స విధానాలు, ఆసుపత్రుల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై సూచనలు చేస్తున్నారు. 


Also read: Cyclone Yaas: మధ్యాహ్నానికి తీరాన్ని దాటనున్న యాస్ తుపాను


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook