Corona Updates in India: భారత్‌లో కరోనా టెర్రర్..తాజాగా కేసులు ఎన్నంటే..!
Corona Updates in India: దేశంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. రోజు వారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి.
Corona Updates in India: దేశంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. రోజు వారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. తాజాగా 13 వేల 313 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇటు కరోనా వల్ల 38 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 83 వేల 990 క్రియాశీల కేసులు ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 2.30 శాతంగా ఉంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 33 లక్షల 44 వేల 958కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 196.62 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Also read:Bandla Ganesh: ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి, పోతుంటాయంటూ పూరీకి కొత్త తలనొప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook