Corona Vaccine for Children: కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులో వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్(Corona vaccine)అందుబాటులో రానుంది. ఇవాళ ఉదయం పార్లమెంట్‌లో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కచ్చితంగా ఇదొక శుభవార్తే. ఆగస్టు నెలలో పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించే అవకాశముందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. 12-18 ఏళ్ల పిల్లల కోసం జైడస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి ప్రారంభం కానుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్న నేపధ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో రావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. భారత్ బయోటెక్ (Bharat Biotech)వ్యాక్సిన్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్(Covaxin clinical trials)జరుగుతున్నాయి. మరోవైపు జైడస్ వ్యాక్సిన్(Zydus vaccine) ట్రయల్స్ ఇప్పటికే పూర్తయి..అత్యవసర అనుమతి కోసం వేచి చూస్తోంది. దేశంలో ఇప్పటికే 44 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.


Also read: Vat on Fuel : ఇంధన ధరలపై వ్యాట్ ఎక్కువ ఆ రెండు రాష్ట్రాల్లోనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook