Covid vaccine: దేశవ్యాప్తంగా కరోనా కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. పెద్దవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపుందుకుంది. అయితే చిన్నారులకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాకపోవటం అందరినీ కలవరపెడుతున్న ఆంశం. టీకా తీసుకోనందున కరోనా మూడోవేవ్ లో ఎక్కువగా చిన్నారులే వైరస్ బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి శుభవార్త(Good news) వెలువడింది. చిన్నారులకు వ్యాక్సిన్(Vaccine) ఎప్పటి నుంచి దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని మేరకు 12-17 ఏళ్ల చిన్నారుల కోసం జిడస్ క్యాడిలా(Zydus Cadila) వ్యాక్సిన్ అక్టోబర్(October) నాటికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. చిన్నారుల(Childrens)కు సంబంధించి దేశంలో ప్రభుత్వ ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.


Also Read: Vaccination: మీరు కరోనా టీకా తీసుకోకపోతే అంతే..!.పరిశోధనల్లో షాకింగ్ విషయాలు...


ప్రభుత్వ ఇమ్యునైజేషన్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ డాక్టర్ అరోరా కీలక వివరాలు ఈ మేరకు వెల్లడించారు.  కోవిడ్-19 వైరస్(Corona Virus) కారణంగా చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యే అవకాశాలు తక్కువేనని ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో నిర్థారణ అయినట్లు  ఆయన తెలిపారు. చిన్నారుల కోసం స్కూల్స్‌(Schools)ను రీ-ఓపన్ చేయడమే మంచిదని సలహా ఇచ్చారు. 


12-18 ఏళ్లలోపు చిన్నారులు(Childrens) దేశంలో 12 కోట్ల మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. వీరిలో 1 శాతం మంది మాత్రమే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే అనారోగ్య సమస్యలు(హైపర్ టెన్షన్, ఒబేసిటీ)తో బాధపడుతున్నట్లు వివరించారు. 18-45 ఏళ్ల లోపు వయస్కుల్లో ఈ సమస్య 10-15 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అందుకే చిన్నారుల కంటే పెద్దవారి వ్యాక్సినేషన్‌కే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. 18 ఏళ్లలోపు చిన్నారులు దేశంలో 44 కోట్ల మంది ఉన్నట్లు డాక్టర్ అరోరా(Doctor Arora) తెలిపారు. వ్యాక్సినేషన్ లేకున్నా వీరు స్కూల్స్‌కు వెళ్లొచ్చన్నారు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook