Vaccination: కరోనా టీకా తీసుకోకుండా బయటకు తిరిగే వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇటీవల కరోనా వ్యాక్సిన్లపై జరిపిన రీసెర్చ్ లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీకా తీసుకోకపోతే కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంట.
యుఎస్ హెల్త్ ఏజెన్సీ సీడీసీ(CDC) ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం, టీకా తీసుకోని వ్యక్తులలో కరోనా(Covid) వచ్చే అవకాశం 29 శాతం ఎక్కువగా ఉందంట. ఇన్ఫెక్షన్(Infection) కారణంగా ఆసుపత్రిలో చేరే వారి ప్రమాదం 29.2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం విస్తరిస్తున్న డెల్టా వేరియంట్(Delta Variant) పరిస్థితుల్లో టీకా అవసరం ఎంతైనా ఉందని పరిశోధనా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. యూకే ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ మోరీ చేసిన అధ్యయనం ప్రకారం, టీకాలు వేయించుకోని వ్యక్తులతో పోలిస్తే వ్యాక్సిన్లు(Vaccine) వేసిన వ్యక్తులకు సంక్రమణ ప్రమాదం 60% తగ్గుతుంది. ఇందులో అసింప్టోమాటిక్ ఇన్ఫెక్షన్ కూడా చేరి ఉంది. దీనివలన కూడా కోవిడ్ నుంచి కొంతవరకూ రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read; PCV Vaccine: ఏపీలో న్యుమోనియో వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
టీకా ఎంత ప్రభావవంతమైందంటే..
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (PHE) డేటా ప్రకారం.. ఫైజర్స్ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనెకా (భారతదేశంలో కోవ్‌షీల్డ్) రెండు టీకాలు(Vaccine)తీసుకున్న వారికి ఆసుపత్రిలో చేరకుండా 96% ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. ఇంగ్లాండ్(England)లో 22 మిలియన్ల అంటువ్యాధులను నివారించడంలో టీకా కార్యక్రమం(Vaccine programme) విజయవంతమైందని PHE అంచనా వేసింది. ఈ టీకా 52,600 హాస్పిటలైజేషన్లను, 35,200 నుండి 60 వేల మరణాలను కాపాడిందని కూడా చెప్పవచ్చు.
వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందొచ్చని సీడీసీ(CDC) పరిశోధనలు చెబుతున్నాయి. భారత్ లో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందనే అంచనాల నేపథ్యంలో టీకా కార్యక్రమం మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా.. వ్యాక్సిన్ ఇంకా తీసుకొని వారు వెంటనే తీసుకునేందుకు ప్రయత్నించడం.. టీకా తీసుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధనల ద్వారా స్పష్టం అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook