Coronavirus Spread: పెరుగుతున్న కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో ఆరుగురు మృతి
Coronavirus Spread: దేశంలో కరోనా సంక్రణ భయం పెరుగుతోంది. దాదాపు రెండేళ్ల విరామం తరువాత మరోసారి పంజా విసురుతోంది. ఈసారి కొత్త వేరియంట్ రూపం దాల్చడంతో ఆందోళన పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Coronavirus Spread: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు కూడా పెరుగుతుండటంతో కలకలం రేగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా సంక్రమణ భయం ఎక్కువగా కన్పిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు, ఏపీలలో ఒకరు మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకూ అంటే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 5,33,340 మంది మరణించారు. కరోనా మరణాల శాతం దేశంలో 1.8 గా ఉంది. దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4 ,50,09,660గా ఉంది. అదే సమయంలో రికవరీ రేటు 98.81 ఉంది.
మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 63 నమోదయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 8 కొత్త కేసులు నమోదు కాగా 59 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 1333 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అటు ఏపీలో గత 24 గంటల్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 29 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook