ముంబై : నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ (NCP chief Sharad Pawar) ఇంట్లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. దక్షిణ ముంబైలోని ఆయ‌న నివాసంలో న‌లుగురికి కోవిడ్19 పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ విషయాన్ని మ‌హారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. శరద్ పవార్ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి, పని మనిషికి, మరో వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిపారు. Dogs to Sniff Out COVID19: కోవిడ్19 నిర్ధారణకు కుక్కలు రిక్రూట్.. ఎక్కడంటే?


ఆదివారం నాడు శరద్ పవార్‌ బ్రీచ్ క్యాండి  ఆస్పత్రికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. నేడు కోవిడ్19 టెస్టు ఫలితాలు రాగా, శరద్ పవార్‌కు నెగటివ్‌ (Sharad Pawar Tested COVID19 Negative:)గా తేలినట్లు మంత్రి తోపే వెల్లడించారు. ఎందుకైనా మంచిదని కొన్నిరోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని, ఏ కార్యక్రమాలకు హాజరు కాకూడదని వైద్యులు శరద్ పవార్‌కు సూచించినట్లు వివరించారు. శరద్ పవార్‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..