Coronavirus: కోరలు చాస్తోన్న కరోనా వైరస్, పెరుగుతున్న కేసుల సంఖ్య
Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ , కఠిన ఆంక్షలు లేకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది.
Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ , కఠిన ఆంక్షలు లేకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది.
ఇండియాలో కరోనా మహమ్మారి(Coronavirus pandemic) కోరలు చాస్తోంది. కరోనా కేసులు ప్రతిరోజూ వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 68 వేల మార్క్ దాటింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంత భారీగా ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో కొత్తగా 68 వేల 20 కేసులు నమోదయ్యాయి. అలాగే 291 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1 కోటి 20 లక్షల 39 వేల 644 కరోనా కేసులు నమోదు కాగా.. 1 లక్షా 61 వేల 843 మంది మరణించారు.గత 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 32 వేల 231 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1 కోటి 13లక్షల 55 వేల 993కి చేరింది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షల 21 వేల 808 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు(Corona Recovery Rate)94.32శాతం ఉండగా.. మరణాల రేటు 1.34శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 9 లక్షల 13 వేల 319 కరోనా నిర్థారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 24 కోట్ల 18 లక్షల 64 వేల161 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు.
Also read: Holi 2021 Celebration Ban: హోలీ వేడుకలు నిషేధించిన, ఆంక్షలు విధించిన రాష్ట్రాలు, కండీషన్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook