Delhi Corona Update: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ భయం పట్టుకుంది. రోజూ 5 వందల కొత్త కేసులు నమోదవడమే కాకుండా కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజూ 5 వందల వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్నించి ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతున్నా..రెండ్రోజుల్నించి 5 వందలు దాటుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 7.72గా ఉంది. ఢిల్లీలో చిన్నారులకు పెద్దఎత్తున కరోనా సోకడం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటంతో స్కూల్స్ పాక్షికంగా మూసివేశారు. 


ఢిల్లీలో గత 24 గంటల్లో 6 వేల 492 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 501 కొత్త కేసులు వెలుగు చూశాయి. అటు 290 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 1729 మంది కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 28 తరువాత అత్యధిక కేసులు నిన్న నమోదయ్యాయి. జనవరి 28వ తేదీన ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 8.60 శాతం కాగా..నిన్న 7.79 శాతముంది. అటు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మార్చ్ 1 తరువాత ఇదే అత్యధికం. 


ఢిల్లీలో పెరుగుతున్న కరోనా సంక్రమణ దృష్టిలో ఉంచుకుని కీలకమైన డీడీఎంఏ భేటీ రేపు అంటే ఏప్రిల్ 20న జరగనుంది.ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. మాస్క్ ధారణ విషయంలో మరోసారి ఢిల్లీలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మాస్క్ ధరించనివారిపై ఢిల్లీలో చలాన్లు లేకపోవడంతో నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఢిల్లీలో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిందని చింతించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..ప్రమాదకర పరిస్థితి లేదన్నారు. మాస్క్ ధరించడం ఇప్పుడు తప్పనిసరి కానుందన్నారు. ఢిల్లీ స్కూల్స్ కోసం నిబంధనలు జారీ చేశామన్నారు. 


Also read: Army Chief: ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ పాండే.. మే 1న బాధ్యతలు! తొలిసారి ఇంజినీర్‌కు సైన్యం బాధ్యతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook