'కరోనా వైరస్' మహమ్మారి విప్పుతున్న జడలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతకంతకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలోనూ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మరణ మృదంగం మోగిస్తోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్య దాదాపు సెంచరికీ చేరువగా వెళ్లింది. 24 గంటల్లో కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా 97 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో మృతి చెందిన వారి సంఖ్య చూస్తే..ఇదే అత్యధికం కావడం విశేషం.  


అంతేకాదు గత 24 గంటల్లో ఏకంగా 4 వేల 213 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇంత ఎక్కువగా కేసులు నమోదు కావడం కూడా రికార్డేనని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  గతంలో మే 5న ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 3 వేల 900గా ఉంది. మే 5 నాటి రికార్డును మే 10 బద్ధలు కొట్టింది. 


[[{"fid":"185454","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"float: left;","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


మరోవైపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్  పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేల 152కు చేరింది. అందులో 44 వేల 29  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 20 వేల 916 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 2 వేల 206 మంది బలయ్యారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..