న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చివరి 24 గంటల్లో కొత్తగా మరో 1,813 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కి చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,008కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు 7,797 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,982 మంది కరోనా వైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. 


Also read : గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు


దేశంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో కొత్తగా 597 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,915కి చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (4,082 కరోనా పాజిటివ్ కేసులు), ఢిల్లీ (3,439 కరోనా పాజిటివ్ కేసులు), మధ్యప్రదేశ్ (2,560 కరోనా పాజిటివ్ కేసులు), రాజస్థాన్ (2,438 కరోనా పాజిటివ్ కేసులు), తమిళనాడు (2,162 కరోనా పాజిటివ్ కేసులు), ఉత్తర్ ప్రదేశ్ (2,134 కరోనా పాజిటివ్ కేసులు), తెలంగాణ (1,016 కరోనా పాజిటివ్ కేసులు) ఉన్నాయి. 


Also read : లాక్‌డౌన్ సడలింపునకు ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు ఇవే


ఏప్రిల్ 29, బుధవారం సాయంత్రం వరకు చేసిన కోవిడ్-19 పరీక్షల వివరాల ప్రకారం.. 
పశ్చిమ బెంగాల్ ( 696 కరోనా పాజిటివ్ కేసులు), 
జమ్మూ కశ్మీర్  (581 కరోనా పాజిటివ్ కేసులు), 
కేరళ ( 495 కరోనా పాజిటివ్ కేసులు), 
బీహార్ ( 403 కరోనా పాజిటివ్ కేసులు), 
పంజాబ్ ( 375 కరోనా పాజిటివ్ కేసులు), 
హర్యానా ( 311 కరోనా పాజిటివ్ కేసులు), 
ఒడిషా ( 125 కరోనా పాజిటివ్ కేసులు), 
జార్ఖండ్ ( 107 కరోనా పాజిటివ్ కేసులు), 
చండీఘడ్ ( 68 కరోనా పాజిటివ్ కేసులు), 
ఉత్తరాఖండ్ ( 55 కరోనా పాజిటివ్ కేసులు), 
హిమాచల్ ప్రదేశ్‌లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..