గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్  నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.

Last Updated : Apr 30, 2020, 02:16 AM IST
గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్  నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. బుధవారం తెలంగాణలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. 

Also read: ఏపీలో తాజాగా 73 మందికి కరోనా.. 3 జిల్లాల్లో భారీగా కేసులు

రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇవాళ బుధవారం ఒక్కరోజే 35 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం 582 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు మరో 25 మంది కరోనా కారణంగా మృతి చెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News