మనిషికి కష్టం వస్తే. . దేవుడా కాపాడు.. అని మొర పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది.  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' ప్రభావం ఇప్పుడు సాక్షాత్తూ భగవంతునిపైనా పడింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్' దెబ్బకు.. ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడడం మానేశారు. మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకే ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. గుంపులుగా ఉంటే కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఎవరూ రద్దీగా ఉన్న చోట్లకు వెళ్లవద్దంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్.. అన్నీ మూసి వేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ ప్రభావం ఆలయాలపైనా పడింది. భారత దేశంలోని పలు ఆలయాలు మూత పడుతున్నాయి. 


[[{"fid":"183251","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also:  'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!


మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని రేపటి నుంచి మూసివేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు చివరిసారిగా భస్మాహారతి నిర్వహించారు. మరోవైపు మహారాష్ట్ర పుణేలోని దుగ్ధషేఠ్ హల్వాయి ఆలయాన్ని మూసివేశారు. ఈ క్రమంలో ఆలయాన్ని మూసివేయక ముందే భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతున్ని దర్శించుకున్నారు. దేవుడా..!! కరోనా వైరస్ ఉపద్రవం నుంచి మమ్మల్ని కాపాడు అని మొర పెట్టుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది. అటు కర్ణాటకలోనూ ఆలయాలు మూతపడుతున్నాయి. కర్ణాటకలో నిన్న మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 10కి చేరుకుంది. 


[[{"fid":"183252","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


కోవిడ్-19 వైరస్  నేపథ్యంలో పంజాబ్  అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే భక్తుల కోసం హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భక్తుల రాకను అడ్డుకోవడం మంచిది కాదని  భావించిన శిరోమణి ప్రబంధక్ కమిటీ హ్యాండ్ శానిటైజర్లు ఇవ్వడంతోపాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 


[[{"fid":"183253","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Read Also: హీరోయిన్‌కు కరోనా వైరస్


[[{"fid":"183254","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


కలియుగ వైకుంఠం తిరుమలలో వెంకన్న స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు. ఐతే కరోనా వైరస్ నేపథ్యంలో గుడి లోపల, పరిస ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు రెండు రోజుల ముందుగానే టోకెన్లు అందిస్తున్నారు. మరోవైపు జమ్ము కాశ్మీర్ లోని వైష్ణోదేవీ ఆలయంలో ప్రవేశద్వారం వద్దే అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వారిని లోపలికి అనుమతిస్తున్నప్పటికీ.. మరో 28 రోజుల వరకు ఎవరూ ఆలయానికి రావద్దని దేవాలయ సంస్థ ప్రకటన జారీ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..