coronavirus: హీరోయిన్‌కు కరోనా వైరస్

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా ఎవరినీ వదలడం లేదు. ధనిక, పేద, ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. ఇలా తేడా లేకుండా వ్యాపిస్తోంది. దీంతో జనం ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 

Last Updated : Mar 16, 2020, 01:42 PM IST
coronavirus: హీరోయిన్‌కు కరోనా వైరస్

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా ఎవరినీ వదలడం లేదు. ధనిక, పేద, ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. ఇలా తేడా లేకుండా వ్యాపిస్తోంది. దీంతో జనం ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఇంతకు ముందే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవడం చూశాం. ఇప్పుడు ఇదే భయంతో చాలా మంది ఆస్పత్రులకు పరుగుపెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. 

'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'
తాజాగా 'కరోనా వైరస్' హాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా తాకింది. హాలీవుడ్  హీరోయిన్ వోల్గా కురిలెంకోను కరోనా వైరస్ అటాక్ చేసింది. దీంతో ఆమె తన ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని.. ఈ కారణంగా ఇంట్లోనే బంధీ అయిపోయానని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వారం రోజుల నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Locked up at home after having tested positive for Coronavirus. I’ve actually been ill for almost a week now. Fever and fatigue are my main symptoms. Take care of yourself and do take this seriously! Сижу в изоляции дома с диагнозом Коронавирус. Уже почти неделю болею. Температура и слабость - мои основные симптомы. Будьте осторожны и принимайте это во всерьёз! #coronavirus #коронавирус

A post shared by Olga Kurylenko (@olgakurylenkoofficial) on

Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర

ఆమె 2008లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా క్వాంటమ్ ఆఫ్ సొలేస్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2013లో 'ఒబ్లివియోన్' సినిమాలో కీలక పాత్ర పోషించింది. Read Also: తెలంగాణలో మూడో కరోనా కేసు  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News