ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవజాతి ప్రాణాలనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం దారుణంగా దెబ్బతీస్తోంది. భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యం కూడా కరోనా ధాటికి విలవిలలాడుతూ తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద కూడా దారుణంగా పతనమైందని, గత రెండు నెలల వ్యవధిలో ముఖేశ్ నెట్ వర్త్ లో 28 శాతం తగ్గుదుల నమోదైందని, తద్వారా ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు పడిపోయిందని మార్కెట్ వర్గాల తెలిపాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 31వరకు అంచనాల ప్రకారం రోజుకు 300 మిలియన్ డాలర్ల చొప్పున నష్టపోయినట్టు ఓ నివేదికలో వెల్లడి కాగా, హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 8 స్థానాలు పతనమై 17వ స్థానానికి చేరుకున్నారని పేర్కొంది. 


ప్రపంచ స్థాయిలో అంబానీ కంటే ఎక్కువగా నష్టపోయింది ఫ్రెంచ్ ఫ్యాషన్ రంగ దిగ్గజం ఎల్వీఎంహెచ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, మొత్తం సంపదలో 28 శాతం తగ్గుదల నమోదైందని, ప్రస్తుతం ఆర్నాల్ట్ సంపద విలువ 77 బిలియన్ డాలర్లు అని తెలిపింది. మరోవైపు భారత్ లోని ఆదానీ గ్రూప్ కు చెందిన గౌతమ్ అదానీ (37 శాతం), హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ (26 శాతం) సైతం భారీగా నష్టపోయారని అంచనా వేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..