Corona new strain: మహారాష్ట్రలో కొత్త రకం కరోనా వైరస్, రంగంలో దిగిన మార్షల్స్
Corona new strain: కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగలేదా..కరోనా కొత్త స్ట్రెయిన్ పంజా విసురుతోందా..మహారాష్ట్రలో పరిస్థితి చూస్తే అదే అన్పిస్తోంది. కొత్త స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ కేసులు ఎక్కువవుతున్నాయి.
Corona new strain: కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగలేదా..కరోనా కొత్త స్ట్రెయిన్ పంజా విసురుతోందా..మహారాష్ట్రలో పరిస్థితి చూస్తే అదే అన్పిస్తోంది. కొత్త స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ కేసులు ఎక్కువవుతున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి కొత్త స్ట్రెయిన్(Corona new strain )మహారాష్ట్రలో విజృంభిస్తోంది. వైరస్ నియంత్రణలో వచ్చింది..వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిందని ఊపిరి పీల్చుకునేలోపే కొత్త స్ట్రెయిన్ కలకలం కల్గిస్తోంది. మహారాష్ట్ర ( Maharashtra )లోని అమరావతి, అకోలా జిల్లాల్లో కొత్త స్ట్రెయిన్ కేసులు పెద్దఎత్తున వెలుగు చూశాయి. ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ సుభాష్ సలంఖే వెల్లడించిన విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మహారాష్ట్ర అమరావతిలో 7 వందల మందికి కరోనా పాజిటివ్‌గా తేలితే...350 మందికి కొత్త రకం కరోనా సోకినట్టు నిర్దారణైంది. నాగ్‌పూర్ నుంచి ఔరంగాబాద్ వరకూ ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని డాక్టర్ సుభాష్ తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం దీనికి కారణాలని అన్నారు. కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకిన వెంటనే న్యూమోనియాకు దారి తీయడం వల్ల మరణాల రేటు పెరుగుతోందన్నారు. మహారాష్ట్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి బచ్చు కదూకి రెండవసారి కరోనా వైరస్ సోకింది. నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మంత్రులు కరోనా వైరస్ బారినపడ్డారు.
కొత్త రకం కరోనా వైరస్ ( Coronavirus new strain )ఇతర ప్రాంతాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 5 వేలకుపైగా కేసులు నమోదవడం కలకలంగా మారింది. హోటల్స్‌లో 50 శాతం ఆక్సుపెన్సీకు అనుమతి, ఒక భవనంలో 5 కంటే ఎక్కువ కేసులొస్తే సీజ్ చేయడం, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతించడం వంటి నిబంధనల్ని ముంబై, నాగపూర్‌లలో అమలుచేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra government )ఇప్పుడు మార్షల్స్‌ని రంగంలో దింపింది. బహిరంగ ప్రాంతాల్లో తిరిగేవారు, మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్క్‌లు ధరించకపోతే మార్షల్స్ వచ్చి బలవంతంగా మాస్క్ పెట్టుకునేలా చర్యలు తీసుకుంటారు. మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra government ) ఆంక్షల్ని ఇక కఠినంగా అమలు చేయనుంది.
Also read: Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook