భారత్‌లో కరోనా వైరస్ (India COVID19 Cases) మహమ్మారి పంజా విసురుతోంది. నిత్యం భారీగా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38,902 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. ఒకరోజు నమోదైన కేసులలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం. కరోనా కేసులపై ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో 543 మంది ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ మరణించారు. భారత్‌లో కోవిడ్19 మరణాల సంఖ్య 26,816కు చేరుకుంది. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Cases in India) 10,77,618కు చేరింది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం ఇప్పటివరకూ 6,77,423 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,73,379 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  ఎప్పటికీ సెక్స్ వర్కర్‌గానే జీవిస్తాం.. తప్పదు!


భారత్‌లో ఇప్పటివరకూ 1,37,91,869 శాంపిల్స్ టెస్టులు జరిపినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. కేవలం జులై 18న ఒక్కరోజు 3,58,127 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టు చేశారు. కరోనా పేషెంట్ల రికవరీ రేటు 62.8శాతంగా ఉంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..