Coronavirus positive cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకేసులు ( Coronavirus ), మరణాల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 61,537 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 933మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ  ( health ministry ) శనివారం తెలిపింది. తాజాగా నమోదయిన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20,88,612కి పెరిగింది. మరణాల సంఖ్య 42,518కి చేరింది. Also read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి


ప్రస్తుతం దేశంలో 6,19,088 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,27,006 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 5,98,778 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఆగస్టు 7 వరకు 2,33,87,171, కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. Also read: Air India Flight Crash: 20కి చేరిన మృతుల సంఖ్య