న్యూ ఢిల్లీ: కోవిడ్-19 పాజిటివ్‌తో (COVID-19 positive) బాధపడుతున్న పలువురు రైళ్లలో ప్రయాణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత వారమే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన నలుగురు వ్యక్తులు ముంబై నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి మార్చి 16న గోదన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని (Godan express train) B1 బోగీలో ప్రయాణించారు. వారికి నిన్న జరిపిన కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ (Coronavirus positive) అని తేలడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైలులో ప్రయాణించిన వారికి కరోనావైరస్ ఉందని తెలిసిన అనంతరం రైల్వే శాఖ ట్విటర్ (Indian Railways twitter) ద్వారా రైలు ప్రయాణికులకు (Train passengers) ఓ విజ్ఞప్తి చేసింది. ఎంతో తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే తప్ప... అనవసర రైలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందిగా రైల్వే శాఖ కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా మార్చి 13న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో (AP Sampark kranthi express) ఢిల్లీ నుంచి తెలంగాణలోని రామగుండం వెళ్లిన 8 మంది ప్రయాణికులకు సైతం కరోనా వైరస్ పాజిటివ్‌తో బాధపడుతున్నట్టు తేలిన విషయాన్ని రైల్వే శాఖ ట్విటర్ ద్వారా గుర్తుచేసింది. 


బెంగుళూరు-ఢిల్లీ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో (Delhi-Bengaluru Rajdhani express train) ప్రయాణించిన ఇద్దరికి క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన రైల్వే అధికారులు.. వారిని మార్గం మధ్యలోనే రైల్లోంచి దించేసి.. మొత్తం బోగీని శానిటైజర్స్‌తో పరిశుభ్రం చేసి పంపించారు.


ఇలా రైళ్లలో ప్రయాణించిన వారికి కరోనా వైరస్ పాజిటివ్ ఉందని గుర్తించిన నేపథ్యంలో ఎంతో అవసరమైతే తప్ప రైలు ప్రయాణాలు చేయకుండా ఉండాల్సిందిగా రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.