ఢిల్లీ: కరోనావైరస్ పేరు వింటేనే వణికిపోయే దుస్థితి నెలకొంది. కరోనావైరస్ ఎక్కడ, ఎవరికి ఉందో తెలియక.. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక జనం హడలి చస్తున్నారు. కరోనావైరస్ కాదు కదా... పక్కనుండే వాళ్లకు కొంచెం జలుబు చేసి జ్వరం వచ్చినా... వాళ్లకు ఏమైందో ఏమోనని దూరం జరిగే దుస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఢిల్లీలో కరోనావైరస్‌తో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ ఆరుగురికి కరోనా సోకిందేమోననే భయంతో వారికి పరీక్షలు నిర్వహించగా... అదృష్టవశాత్తుగా వారికి నెగటివ్ అనే తేలింది. ఆ విషయం తెలిశాకా.. వాళ్లు, వాళ్ల ఇరుగుపొరుగే కాదు.. నొయిడా వాసులు కూడా ''హమ్మయ్య వాళ్లకు కరోనా లేదట'' అని ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే ఆ కరోనా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉండేదని నొయిడా వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : PM Narendra Modi On COVID-19: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ


నొయిడాలోని ఆరుగురు అనుమానితులకు కరోనావైరస్ పరీక్షల్లో నెగటివ్ అని తేలిన అనంతరం.. ఇదే విషయమై జిల్లా మెజిస్ట్రేట్ బిఎన్ సింగ్ మాట్లాడుతూ.. ''ఆరుగురి శాంపిల్స్ కరోనావైరస్ నెగటివ్ వచ్చిందని.. అయినప్పటికీ వారిని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే అబ్‌జర్వేషన్‌లో ఉంచుతాం'' అని అన్నారు. ఒకవేళ ఆలోగా ఏమైనా కరోనావైరస్ వ్యాధి లక్షణాలు కనిపించినట్టయితే, అప్పుడు వారికి మరోసారి కరోనై టెస్ట్ నిర్వహించిన తర్వాతే ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు. అప్పటివరకు వారు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిఎన్ సింగ్ చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..