Coronavirus updates, Active Covid cases dip below 3 lakh: దేశంలో కరోనా (corona) కేసులు, మరణాల్లో కొంతకాలంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,382 మందికి కరోనా సోకింది. ముందురోజుతో పోల్చితే ఈ కొత్త కేసులు సంఖ్య కాస్త తగ్గింది. అయితే మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు 4.46లక్షల మంది కరోనాకు (corona) బలయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే


నిన్న ఒక్కరోజే 32,542 మంది కోవిడ్ (covid) నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.28 కోట్లకు చేరాయి. క్రియాశీల కేసులు మూడు లక్షలకు పైగానే తగ్గాయి. ఆ రేటు 0.89 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 97.78 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు ప్రస్తుతం సానుకూలంగా కనిపిస్తున్నాయి.


మరోవైపు దేశంలో కోవిడ్ (covid) వ్యాక్సినేషన్ (vaccination) కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న 72.2 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశంలో ఇప్పటివరకు  84.15 కోట్ల పైగానే వ్యాక్సిన్‌ (vaccine) డోసులు పంపిణీ అయ్యాయి.


Also Read : PM Modi US Tour: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook