Corona cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 27,553 కేసులు నమోదు
Corona cases in India: దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 27,553 కేసులు నమోదయ్యాయి. 284 మంది మరణించారు. శనివారం ఒక్క రోజే 58,11,487 మందికి టీకాలు అందించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరింది.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి 9,249 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,48,61,579 కు చేరింది. కొవిడ్ మహమ్మారి ధాటికి ఇప్పటి వరకు దేశంలో 4,81,486 మరణించారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,22,801 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా 3,42,75,312 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 58,11,487 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,16,24,150 కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 11,87,318 పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,878 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read:CDS Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ పూర్తి- వచ్చే వారమే తుది నివేదిక!
Also Read: Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి