Covaxin vaccine doses missing: హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.1 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు. అయితే కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్ (Bharat Biotech), కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం చూస్తే.. ఇప్పటివరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి. మరి 6 కోట్ల కొవాగ్జిన్ డోసుల్లోంచి 2.1 కోట్ల డోసులు ఇచ్చినట్టయితే.. మిగిలిన దాదాపు 4 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఏమైనట్టు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో భారత్ బయోటెక్ 8 కోట్ల కోవాగ్జిన్ డోసులు (Covaxin vaccine doses) తయారు చేసినట్టు కంపెనీ ఇచ్చిన ప్రకటనలే స్పష్టంచేస్తున్నాయి. అందులో వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా 2 కోట్ల డోసులు విదేశాలకు ఎగుమతి అయినట్టుగా భావించినా.. మిగతా 6 కోట్ల డోసులలో 2 కోట్ల డోసులు పోగా మరో 4 కోట్ల డోసులు ఏమయ్యాయనేదే ప్రస్తుతం ఓ పజిల్‌గా మారింది. 


Also read  : Pfizer, Moderna and J&J vaccines: ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల


కొవాగ్జిన్ వ్యాక్సిన్ షాట్స్ వినియోగం ఢిల్లీలోనే అధికంగా కనిపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఢిల్లీలోనే అత్యధికంగా 31 శాతం మంది కోవాగ్జిన్ డోసులు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనూ కొవాగ్జిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో పలు చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ (COVID-19 Vaccination in Delhi) నిలిచిపోయింది. 


ఇప్పటివరకు దేశంలోని మరో 14 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక్క కొవాగ్జిన్ డోసు (Covaxin vaccine shots) కూడా అందలేదు. మరో ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకు చేపట్టిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కొవాగ్జిన్ వాటా కేవలం 5 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు సైతం కొవాగ్జిన్ డోసులు అందనప్పుడు ఆ మిగతా డోసులు అన్నీ ఏమయ్యాయనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొవాగ్జిన్ డోసులను ఎవరైనా బ్లాక్ చేసి ఉంటారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.


Also read : Pfizer COVID-19 Vaccine: భారత్‌కు 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు అమెరికా ఫార్మా సంస్థ రెడీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook