Covid 19 cases: దేశంలో నిన్నటి కంటే స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
Covid 19 cases in India: దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శుక్రవారం (జనవరి 21) దేశవ్యాప్తంగా 3,47,254 కరోనా కేసులు నమోదవగా ఇవాళ (జనవరి 22) 3,37,704 కేసులు నమోదయ్యాయి. అంటే.. నిన్నటితో పోలిస్తే 9550 కేసులు తక్కువగా నమోదయ్యాయి.
Covid 19 cases in India: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపుగా వెయ్యి కేసులు తక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.89 కోట్లకు చేరింది. మరో 488 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 2,42,767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా పేషెంట్ల రికవరీల సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 16.65 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050కి చేరింది. నిన్నటితో పోలిస్తే 3.69 శాతం మేర ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగింది.
దేశంలో ఇప్పటివరకూ 161 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. 18 ఏళ్లు పైబడిన దాదాపు 94 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తయింది. 72 శాతం జనాభాకు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయి. కోవిడ్ (Covid 19) నుంచి కోలుకున్న బాధితులకు ప్రికాషనరీ డోసు సహా కోవిడ్ వ్యాక్సిన్లు 3 నెలల తర్వాతే వేయాలని కేంద్రం తాజా గైడ్ లైన్స్‌లో వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook