Covid-19 Updates: దేశంలో 4 వేలు దాటిన కొవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
Covid-19 Update: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
Covid-19 JN.1 Variant: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈసారి మరో కొత్త రూపంలో ఇండియాపై ఎటాక్ చేస్తోంది. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కేసులు వెలుగు చూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 4,054 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఒక్క కేరళలోనూ 128 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కేరళలో వైరస్ తో ఒకరు మృతి చెందారు. దీంతో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,33,334 (5.33 లక్షలు)కు చేరింది. మహమ్మారి నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 4,44,71,860(4.44 కోట్లు)కి చేరుకుంది.జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.
భయపడాల్సిన అవసరం లేదు..
పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. మరోవైపు సబ్ వేరియంట్ జేఎన్ 1 కోసం అదనపు డోస్ అవసరం లేదని సార్స్-కోవ్ 2 జీనోమిక్స్ కన్యార్షియం(ఇన్సాకాగ్) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ఈ వేరియంట్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంట వంటి లక్షణాలు ఉంటాయని.. రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook