కరోనాపై పోరులో నేను సైతం అంటూ.. ముందడుగేసిన ప్రథమ మహిళ..
ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆందోళనపరుస్తున్న కరోనా వైరస్ పై పోరాటంలో తనవంతు సహకారం అందించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్‌లు కుట్టారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆందోళనపరుస్తున్న కరోనా వైరస్ పై పోరాటంలో తనవంతు సహకారం అందించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్‌లు కుట్టారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లోని శక్తి హాల్‌లో ముఖానికి ధరించే మాస్కులను ఆమె కుట్టారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డులోని పలు ఆశ్రయ గృహాలలో ఈ మాస్కులను పంపిణీ చేయనున్నారని, సవితా కోవింద్ తన ముఖానికి ఎరుపు రంగ మాస్క్‌ను ధరించి ఎంతో శ్రద్ధగా కుట్టుమిషన్‌పై మాస్క్‌లు కుడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Telangana: కొత్తగా 27 కరోనా కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం
ఢిల్లీలోని పలు ఆశ్రయ గృహాలలో ముఖానికి ధరించే మాస్కులను పంపిణీ చేసేందుకు మాస్క్‌లు కుడుతున్న ప్రథమ మహిళ శ్రీమతి సవితా కోవింద్ దేశవ్యాప్తంగా కరోనా కష్ట కాలంలో తనవంతుగా కుట్టుమిషన్ ద్వారా మాస్కులు కుట్టడానికి శ్రీకారం చుట్టడాన్ని పలువురు ప్రముఖులు ధన్య వాదాలు తెలియజేశారు. ఇందులో భాగంగానే మీకు ధన్యవాదాలు అమ్మ అని క్యాప్షన్ తో కర్నాటక బీజేపీ ట్వీట్టర్ అకౌంట్ ఈ వైరల్ ఫోటోను షేర్ చేసింది.