Covid19 Cases in India: కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. బుధవారంతో పోలీస్తే 20 శాతానికి పైగా కొవిడ్ కేసులు గురువారం వెలుగు చూశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురవారం 8 గంటల వరకు 5,335 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ లో రోజువారీ పాజిటివిటీ రేటు 3.32%గా రికార్డు అవ్వగా.. వారపు పాజిటివిటీ రేటు 2.89% వద్ద కొనసాగుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.7 శాతంగా, యాక్టివ్ కేసులు 0.06 శాతంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,826 కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,41,82,538కి చేరింది. 194 రోజుల తర్వాత ఒక్క రోజులో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. 


దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇందులో 95.21 కోట్ల మందికి రెండో డోసు పూర్తవ్వగా.. 22.87 కోట్ల మందికి మెుదటి డోసు కంప్లీట్ అయింది. గత 24 గంటల్లో దాదాపు 1,993 టీకాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 92.23 కోట్ల కోవిడ్-19 టెస్టులు చేశారు. గడిచిన ఒక్క రోజులో దాదాపు 1,60,742 మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న భారత్ లో 4,435 కొవిడ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 


Also Read: Bikini Girl in Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో అరాచకం.. బికినీలో యువతులు! వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook