Airtel OTT Recharge Plans: ఈ రెండు ఎయిర్ టెల్ రీచార్జ్ ప్లాన్స్‌తో Netflix, Prime & Disney+ Hotstar మూడూ ఉచితమే!

Airtel OTT Recharge Plans: ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాల పోటీలో కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్స్ కస్టమర్లకు అందుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 08:04 AM IST
Airtel OTT Recharge Plans: ఈ రెండు ఎయిర్ టెల్ రీచార్జ్ ప్లాన్స్‌తో Netflix, Prime & Disney+ Hotstar మూడూ ఉచితమే!

Airtel Cheap & Best Plans for OTT Subscription: ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త ప్లాన్స్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్స్‌తో పాటు అదనపు ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది. కొత్త ప్లాన్స్ కోసం చూస్తుంటే ఇవి బెస్ట్ ప్లాన్స్ కాగలవు. ఎందుకంటే ఈ ప్లాన్స్‌తో అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 999,1199 రూపాయల పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌లో చాలా ప్రయోజనాలు అందుతాయి.

Airtel 999 Postpaid Plan: 

ఎయిర్‌టెల్ 999 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఒక ఫ్యామిలీ ప్లాన్. ఇందులో ప్రైమరీ కనెక్షన్ ఒకటి ఉంటుంది. అదనంగా రెండు కనెక్షన్లు వస్తాయి. ఈ ప్లాన్‌లో మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 100 జీబీ నెలసరి డేటా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, సెక్యూర్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

ప్రైమరీ కనెక్షన్ నెలసరి 100 జీబీ డేటా ఉంటుంది. అదనపు కనెక్షన్లకు నెలకు 30 జీబీ డేటా ఉంటుంది. ఈ ప్లాన్ రోల్ ఓవర్ డేటా 200 జీబీ వరకూ ఇస్తుంది. 

Also Read: DC Vs GT Highlights: ఐపీఎల్ చరిత్రలోనే డేంజర్ బాల్.. దెబ్బకు గిల్ క్లీన్‌బౌల్డ్

Airtel 1199 Postpaid Plan:

ఎయిర్‌టెల్ 1199 రూపాయల ప్లాన్ 150 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటుగా లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే అదనంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మూడూ అందుతాయి.

Also Read: Forbes list 2023: ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేష్ అంబానీ, ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News