COVID-19 vaccination drive successfully conducted on Day-1 | న్యూఢిల్లీ: కరోనావైరస్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు విజయవంతమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా శనివారం 3,351 కేంద్రాల్లో 1,91,181 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ సిబ్బందే కాకుండా రక్షణ శాఖలో పనిచేస్తున్న 3,429 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. ఈ భారీ వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (COVID-19) వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ (Covishield) ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అదేవిధంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కో వ్యాక్సిన్‌ (Covaxin) ను 12 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు వివరించింది. అయితే దేశవ్యాప్తంగా 3,351 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఈ రెండు టీకాలను వినియోగించినట్లు (Health Ministry) వెల్లడించింది. Also Read: COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ


ఇదిలాఉంటే.. శనివారం తొలిరోజు టీకా అనంతరం పలుచోట్ల ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. ఢిల్లీ (Delhi) లో టీకా తీసుకున్న అనంతరం 51 మంది వైద్యసిబ్బంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే సైడ్‌ఎఫెక్ట్‌కు గురైన వారిలో ఒకరు ఆసుపత్రిలో చేరారు. దీంతోపాటు రాజస్థాన్‌లో కూడా 21 సైడ్‌ఎఫెక్ట్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. టీకా తీసుకున్న వారిలో ప్రతికూలతలను పరిశీలించేందుకు ఆదివారం కరోనా టీకా డ్రైవ్‌ చేపట్టబోమని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. 


Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook