Covid-19 Vaccine for children above 2 years : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న సమయంలో కోవిడ్19 వ్యాక్సిన్‌పై మరో శుభవార్త వచ్చింది. మరో కొన్ని వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కానున్న తరుణంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా జాతీయ మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ కల్లా చిన్నారులకు కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని రణదీప్ గులేరియా ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లకు పైగా చిన్నారులకు ఈ కోవిడ్19 వాగ్జిన్‌ను ఇవ్వవచ్చునని తెలిపారు. ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. చిన్నారులపై ఇటీవల కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టడం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫేజ్2 లేదా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ (Covaxin Trials on Children) ఫలితాలు సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చిన్నారులకు కోవాగ్జిన్ టీకాలు ఇవ్వడానికి అదే నెలలో ఆమోదం వస్తుందని భావిస్తున్నారు.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ


మరోవైపు ఫైజర్ - బయో‌ఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను భారత్‌లో అనుమతి లభించింది. కనుక చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌ (Corona Vaccine)లో అది కూడా దోహదం చేస్తుందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ జూన్ 7న 2 నుంచి 17 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. అంతకుముందు మే నెలలోనే రెండేళ్ల చిన్నారుల నుంచి ఫేజ్ 2-3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు భారత్ బయోటెక్‌కు   డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం


భారత్‌లో కరోనా నిబంధనలు పాటించకపోతే, ప్రజలు గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండటం లాంటివి జరిగితే మరో 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. పీటీఐతో సైతం మాట్లాడుతూ.. కోవిడ్19 (Delta Plus Variant Of COVID-19) ఏ విధంగా రూపాంతరం చెందుతుందనే విషయంపై స్పష్టత లేదని, ఆరు నుంచి 8 వారాల్లో కోవిడ్19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని.. సాధ్యమైనంత త్వరగా చిన్నారులకు వ్యాక్సిన్ తీసుకురావడం పరిష్కార మార్గమని సూచించారు. వ్యాక్సిన్ 77.8 శాతం ప్రభావం చూపిందని, ఫేజ్ 3 ట్రయల్స్‌కు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఈ సమాచారాన్ని సమీక్షించడానికి డీసీజీఐకి పంపించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook