Spot registration for COVID-19 Vaccine: 18 ప్లస్ ఏజ్ గ్రూప్ వారు కూడా కొవిన్ పోర్టల్‌పై తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కరోనా టీకాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో చాలా మంది టీకాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా కరోనా టీకాల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారిలో కొంత మంది షెడ్యూల్ ప్రకారం టీకా కేంద్రాలకు హాజరు కాకపోవడంతో వారి కోసం కేటాయించిన కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా అవుతున్నాయి. కరోనా టీకాలు వృథా అవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు అవసరం అయితే టీకాల కోసం ఇకపై కొవిన్‌పై ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కేంద్రాలకు వెళ్లి టీకాలు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కరోనా టీకా కేంద్రాల్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇంటర్నెట్ సదుపాయం లేని వారికి, స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడం తెలియని వారికి మేలు జరగనుంది. ఎందుకంటే కొవిన్‌పై రిజిస్ట్రేషన్ (Vaccine registration on CoWin) చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే వాళ్లు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లి అక్కడ తమ పేరు నమోదు చేయించుకుని టీకా తీసుకునేందుకు వీలు కలుగుతుంది.


Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?


అయితే, కొవిడ్ వ్యాక్సిన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది (COVID-19 vaccine spot registration) కేవలం ప్రభుత్వం నిర్వహించే టీకా కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలా వద్దా అనేది అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేస్తున్నామని కేంద్రం అభిప్రాయపడింది.


Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ? మీకు ఈ విషయం తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook