India’s COVID-19 infection tally rose by 10,302 in a day: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 24 గంటల్లో దేశంలో (Corona new cases in India) కొత్తగా 10,302 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 10,72,863 లక్షల టెస్టులు చేసినట్లు వెల్లడించింది. కొత్త కేసుల్లో దాదాపు సగం ఒక్క కేరళలోనే నమోదైనట్లు  తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా (Corona deaths in India) 267 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఇదిలా ఉండగా.. 24 గంటల్లో 11,787 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 98.29 శాతంగా ఉంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,24,868 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. గడిచిన 531 రోజుల్లో ఇదే అత్యల్ప స్థాయి అని పేర్కొంది వైద్య ఆరోగ్య శాఖ.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం (Total corona cases in India) 3,44,99,925 మందికి కరోనా సోకగా.. అందులో 4,65,349 మంది మరణించారు.


Also read: వైరల్ వీడియో... సాగు చట్టాలపై రాహుల్ గాంధీ గతంలో చెప్పిందే నిజమైంది...


Also read: మందు బాబులు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరు... ఎక్సైజ్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు...


వ్యాక్సినేషన్ ఇలా..


నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 51,59,931 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,15,79,69,274 వద్దకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..


  • అగ్రరాజ్యం అమెరికాలో (Corona cases in US) నిన్న ఒక్క రోజే 111,829 కరోనా కేసులు నమోదయయ్యాయి. 1,332 మంది కరోనాతో మృతి చెందారు.

  • జర్మనీలో 59,266 కొవిడ్ కేసులు, 230 మరణాలు నమోదయ్యాయి.

  • బ్రెజిల్​లో మరో 13,355 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 234 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.

  • బ్రిటన్​లో 44,242 కొత్త కేసులు నమోదయ్యాయి. 157 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

  • రష్యాలో 37, 156 మందికి నిన్న ఒక్క రోజే కరోనా పాజిటివ్​గా తేలింది. 1,254  మంది కొవిడ్ మహమ్మారి కారణంగా మరణించారు.

  • టర్కీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్​, పోలాండ్​, నెదర్లాండ్స్​ దేశాల్లోనూ నిన్న ఒక్క రోజే 20 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదైనట్లు గణాంకాలకు చెబుతున్నాయి.

  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 25.6 కోట్ల మందికి పైగా కరోనా సోకగా.. 51.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.


Also read: వర్షాల ఎఫెక్ట్​: నేడు శమరిమల ఆలయానికి భక్తుల సందర్శనలు రద్దు


Also read: రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి గుడ్​ న్యూస్​- ఆహార సేవలు పునఃప్రారంభం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook