Covid19 Cases in India: కలవరం కల్గిస్తున్న కోవిడ్19, గత 24 గంటల్లో 3 వేల కేసులు
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
Covid19 Cases in India: దేశంలో మళ్లీ కోవిడ్ 19 అలర్ట్ జారీ అవుతోంది. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 2,994 కొత్త కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 16వేలు దాటేసింది. దేశంలో కరోనా సంక్రమణ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇండియాలో గత కొద్దికాలంగా కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,994 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు అదే సమయంలో దేశంలో కరోనా కారణంగా 9 మంది మరణించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెరగగా, యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కు చేరుకోవడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకూ అంటే కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 5,30,876 మంది మరణించారు. ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, గుజరాత్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు.
దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 98.77 శాతముంది. దేశంలో 4,41,71,551 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
Also read: Covid-19 Latest Updates: ఏ మాత్రం తగ్గని కరోనా మహమ్మారి.. నేడు కూడా 3 వేలు దాటిన కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook